పాల్గొన్న ఆర్టీసీ సివిల్ ఏఈ సూర్య సర్పంచ్ సురేష్మద్నూర్ బిచ్కుంద జనవరి 28 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని మద్నూర్ మండల కేంద్రములో గల బస్ స్టేషన్ అవారణలో సి సీ రోడ్డు పనులను శనివారం నాడు స్థానిక సర్పంచ్ దరశ్ సురేష్ మరియు ఆర్టీసీ సివిల్ ఏఈ సూర్య భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సి సి రోడ్డు పనులకు టీ ఎస్ అర్ టి సి నుండి 15 లక్షలు మంజూరు అయినట్లు ఆర్టీసీ ఉమ్మడి జిల్లా సివిల్ ఏఈ సూర్య తెలిపారు. ఈ సందర్భంగా స్థానికులు ప్రయాణికులు నాయకులు టీ ఎస్ ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, అర్ టి సి ఏం డి సజ్జన్, ఎమ్మెల్యే హనుమంత్ షిండే, పార్లమెంట్ సభ్యులు బి బి పాటిల్ లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ప్రచార కార్యదర్శి రచ్చ కుశాల్, గాల్బె వార్ శివాజీ, ఉప సర్పంచ్ విఠల్, వార్డు సభ్యులు సాయి, మాజి ఎంపిటిసి రాములు సివిల్ కాంట్రాక్టర్ అసిస్టెంట్ అనురుద్, స్థానికులు ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు.




