ఉస్మానియా యూనివర్సిటీలో బిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ అవార్డు గ్రహీత వెంకట్ కు ఘన సన్మానం
ఉస్మానియా యూనివర్సిటీ లో తెలంగాణ పంచాయతీ రాజ్ చాంబర్ రాష్ట్ర కార్యదర్శి మందిపల్ వెంకట్ కు అంబేద్కర్ జాతీయ అవార్డు వచ్చిన సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటి వేదికగా బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మొగిలిగిద్ద ప్రసాద్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాల పూర్వ విద్యార్థి మందిపల్ వెంకట్ ను ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో BSF రాష్ట్ర అధ్యక్షుడు గాదె వెంకట్ మాట్లాడుతూ..తెలంగాణ ఉద్యమంలో మందిపాల్ వెంకట్ చేసినటువంటి సేవా కార్యక్రమాల గురించి సాంఘిక అసమానతల పైన తను చేసిన పోరాటం గురించి గుర్తు చేసుకోవడంతో పాటు మందిపల్ వెంకట్ కు జాతీయ అంబేద్కర్ అవార్డు వచ్చిన సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు ఎంతో ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా జాతీయ అంబేద్కర్ అవార్డు గ్రహీత మందిపల్ వెంకట్ మాట్లాడుతూ రాజకీయంగా ఉన్నత శిఖరాల్లో ఉంచేందుకు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఎప్పుడు తనకు తోడుగా ఉన్నందుకు వారికి రుణపడి ఉంటానని అన్నారు.ఈ కార్యక్రమంలో BSF ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షుడు బోరెల్లి సురేష్,BSF రాష్ట్ర నాయకులు శ్రీశైలం,జోగు నరేందర్,జనసేన విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు బైరుపోగు సాంబశివుడు,ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు PHD రీసెర్చ్ స్కాలర్ స్వరాజ్,BSP రాష్ట్ర నాయకులు వెంకట్,OU విద్యార్థి నాయకులు శ్రీకాంత్,విష్ణు,శ్రీశైలం రమేష్,రవి తదితరులు పాల్గొన్నారు