Tuesday, 3 November 2026

ఉ.కొరియా సరిహద్దుల్లో బారికేడ్లు

సియెల్‌: దక్షిణ కొరియాతో ఉన్న సరిహద్దుల సమీపంలో ఉత్తర కొరియా క్షిపణి విధ్వంసక బారికేడ్ల నిర్మాణాన్ని ప్రారంభించింది. చైనా టెలివిజన్‌ ఛానల్‌ని ఉటంకిస్తూ యెన్‌హప్‌ న్యూస్‌ బుధవారం తెలియజేసింది. దూలాలు,  రాళ్ళు, సిమెంట్‌తో ఉత్తర కొరియాకి చెందిన మనుషులు నిర్మాణం చేస్తున్న దృశ్యాలను చైనాకు చెందిన బీజింగ్‌ టెలివిజన్‌ ప్రసారం చేసింది. యద్దం వచ్చినట్లుయితే దక్షిణ కొరియా ట్యాంకులు, ఇతర మిలటరీ వాహనాలను నిలువరించేందుకే ఈ బారికేడ్ల ఏర్పాటు చేస్తున్నారని మీడియా పేర్కొంది. సైనిక దాడికి దేశ నాయకత్వం సంసిద్ద మవుతున్నట్లుగా కనిపిస్తోందని స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *