జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగారం గ్రామంలో రెండు రోజులుగా జరుగుతున్న ఊరి ఉత్సవాల్లో పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ పాల్గొన్నారు. నాగారం గ్రామంలో శీతల భూదేవి, భూలక్ష్మి మహలక్ష్మి గ్రామ శిల సహిత ఆదిత్యాధి ఆంజనేయస్వామి యంత్రమూర్తి ప్రతిష్టాపన ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఆయన గ్రామదేవతల ప్రతిష్టాపన ఉత్సవాల్లో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ దేవతల ఆశీస్సులతో ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు. ఉత్సవాలకు హజరైన జెడ్పీ చైర్మన్ పుట్ట మదూకర్కు ఉత్సవ కమిటి సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయనను శాలువాతో సత్కరించారు




