ఊరుకొండ నర్సింహ మృతి చాలా బాధాకరం పిసిసి నాయకులు కేతావత్ భీల్యా నాయక్
కొండమల్లేపల్లి జనవరి 7 జనం సాక్షి న్యూస్ :
దేవరకొండ పట్టణానికి చెందిన ఆర్యవైశ్య సంఘం నాయకులు ఊరుకొండ నర్సింహ చనిపొయిన విషయాన్ని తెలుసుకున్నా టీపీసీసీ నాయకులు కేతావత్ బీల్యా నాయక్ వారి నివాసానికి చేరుకొని వారి పార్థివ దేహాన్ని పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్బంగా కేతావత్ బీల్యా నాయక్ మాట్లాడుతూ ఊరుకొండ నర్సింహా చేసిన సేవా కార్యక్రమాలు, వారి చేసిన మంచి పనులను కొనియాడారు అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి తెలిపారు వారి వెంట నీల రవి కుమార్, హరి నాయక్,బిచ్చు నాయక్, నాగార్జున, జీవన్, జైపాల్ నాయక్ మరియు ఆర్యవైశ్య నాయకులు, పట్టణ వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు
ఊరుకొండ నర్సింహ మృతి చాలా బాధాకరం పిసిసి నాయకులు కేతావత్ భీల్యా నాయక్




