పాపటపల్లి గ్రామంలో మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
రఘునాథ పాలెం జనవరి 07 జనం సాక్షి
పాపటపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిలుగా హాజరై క్రికెట్ టోర్నమెంట్ ని ప్రారంభించిన పిన్ని కోటేశ్వరరావు, చిన్నబోయిన సైదులు, బాబు ఆర్ఎంపి,కొండపర్తి మల్లిఖార్జున రావు , ,పోయిలబోయిన శ్రీను ,గంగుల మంగయ్య, పావురాల చంద్ర గంగుల సత్యనారాయణ,కాముని నాగేశ్వరరావు,ఈ సందర్భంగా గ్రౌండ్లో కొబ్బరికాయలు కొట్టి రిబ్బన్ కట్ చేసి టోర్నమెంట్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా పిన్ని కోటేశ్వరరావు మాట్లాడుతూ యువత క్రీడల పట్ల ఆసక్తి చూపడం చాలా అభినందనీయం తెలుపుతూ,క్రీడలు మానసికోల్లాసానికి దోహదం చేస్తాయి అని తెలిపారు.అదేవిధంగా గెలుపు,ఓటములు ఆటలో సహజం అనీ,అందరు స్నేహపూర్వక వాతావరణంలో ఆడాలి, ఇప్పుడు ఉన్న పరిస్థితి లో సెల్ ఫోన్ తో అన్ని రంగాల్లో ముందుఉన్న ఈ క్రీడలను నిర్వహిచటం ఈ పాపటపల్లి గ్రామ యువత ఆదర్శమన్నారు.క్రీడాలను ప్రోత్సహిస్తున్న మేనేజ్మెంట్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామ ప్రజలు యువకులు పాల్గొన్నారు




