Wednesday, 4 November 2026

పండ్ల పూల మొక్కలు నాటాలి

పండ్ల పూల మొక్కలు నాటాలి.
దోమ సర్పంచ్ కే.రాజిరెడ్డి
*దోమ జనవరి 7(జనం సాక్షి)
పండ్లు పూల మొక్కల పెంపకానికి ప్రాధాన్యం ఇవ్వాలని దోమ సర్పంచ్ కె రాజిరెడ్డి సూచించారు. శనివారం దోమ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరిని పంచాయతీ కార్యదర్శి చంద్ర శేఖర్ తో కలిసి సందర్శించారు.ఈ సందర్బంగా వచ్చే జూన్ నాటికీ హరితహారంలో భాగంగా నాటే మొక్కల పెంపకానికి బయట నుండి కొనుగోలు చేసిన మొక్కలను చూసారు ఈ సందర్బంగా ప్రజలకు అవసరం అయ్యో మొక్కల పెంపకంకు ప్రాధాన్యత ఇస్తూ మొక్క నాటే దశలో కావలిసిన చెర్యలు తీసుకోవాలని ఉపాధి హామీ సిబ్బందికి సూచనలు చేశారు.నాటిన మొక్కలకు కోతులు మేకల బెడద ఉందని వాచెన్ వార్డులను పని చేసే వారిని నియమించుకోవాలని సర్పంచ్ సూచించారు. అనంతరం నర్సరీ ఫెన్సింగ్ పనులు చూసారు.