Wednesday, 4 November 2026

ఎంఎస్పీ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జాతీయ రహదారి దిగ్బంధం

 

 

 

 

 

 

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ):ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించకుండా మాదిగ,మాదిగ ఉప కులాలను మోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారి దిగ్బంధంను ఎంఎస్పీ జిల్లా ఇన్చార్జి యాతాకుల రాజన్న మాదిగ ఆధ్వర్యంలో సూర్యాపేట మండల పరిధిలోని సోమవారం టేకుమట్ల వద్ద నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు తీగల ప్రదీప్ గౌడ్ ,జాతీయ నాయకులు మంద కుమార్ మాదిగ మాట్లాడుతూ బిజెపి నేతలు ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని, కల్పిస్తామని తమ ఉద్యమం న్యాయమైందని, బీజేపీ అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు.బీజేపీ అధికారంలోకి వచ్చి 9 ఏండ్లు గడుస్తున్న వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడం లేదని, ఎలాంటి చర్చ జరపడం లేదన్నారు.బిజెపి ప్రభుత్వం మాదిగ, మాదిగ ఉపకులాలను మోసం చేస్తుందన్నారు.బిజెపికి పతనం తప్పదన్నారు.ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు పెట్టకపోతే జరగబోయే ప్రతి పరిణామాలకు కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు.ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే అరెస్టు చేశారని, అరెస్టైన నాయకులు, కార్యకర్తలను బేషరతుగా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు చింతలపాటి చిన్న శ్రీరాములు మాదిగ, ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి బొజ్జ సైదులు మాదిగ, వరంగల్ జిల్లా ఇన్చార్జి మంద రాజు మాదిగ, జనగాం జిల్లా ఇంచార్జి ఇనుముల నరసన్న మాదిగ, బిరు మహేందర్ మాదిగ, కందిగట్ల విజయ మాదిగ, ములకలపల్లి రవి , దాసరి వెంకన్న , బొజ్జ వెంకన్న , పుట్టల మల్లేష్, మారపల్లి సావిత్రి , పిడమర్తి నాగేశ్వరి , గారా కనకయ్య , చెరుకుపల్లి చంద్రశేఖర్, మేడి కృష్ణ ,సతీష్ ,కిరణ్, తాటిపాముల నవీన్, వెంకట్రాములు, చిన్ని, వీరమల్ల నవీన్ కుమార్, ఉపేందర్, శేఖర్, సైదులు తదితరులు పాల్గొన్నారు.