Wednesday, 4 November 2026

మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలు.

 

 

 

 

 

ఎమ్మెల్యే మదన్ రెడ్డికమిషనర్ చైర్మన్ సునీత లక్ష్మారెడ్డిజనం సాక్షి/ కొల్చారం మండలం కిష్టాపూర్ గ్రామంలో శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మూడు రోజులపాటు నిర్వహించే జాతర ఉత్సవాల సందర్భంగా నేడు అగ్గిగుండాల కార్యక్రమం నిర్వహించారు. శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ వాకిటి సునీత లక్ష్మారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని పాడి పంటలు బాగా పండాలని ఆ స్వామి వారిని కోరుకున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గోదావరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లేష్ గౌడ్ టిఆర్ఎస్ నాయకులు కాశీనాథ్ గడ్డమీది నర్సింలు తదితరులు పాల్గొన్నారు