తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయం…బిజెపి జిల్లా అధికార ప్రతినిధి స్వామి…
శంకరపట్నం: జనం సాక్షి ఫిబ్రవరి 13కేంద్రంలోని బిజెపి ప్రభుత్వము ప్రధాన నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ పటిష్టత కోసం సైనికుల తెలంగాణలో ప్రతి కార్యకర్త పనిచేయాలని బిజెపి పార్టీ కరీంనగర్ జిల్లా అధికార ప్రతినిధి జానపట్ల స్వామి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రం లో కేశవపట్నం, అంబాలాపూర్ శక్తి లో శక్తి కేంద్రం కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్నర్ మీటింగ్ కు ముఖ్య అతిథి హాజరైన జానపద స్వామి, బిజెపి రాష్ట్ర నాయకులు వోరెo జయ చందర్ మాట్లాడారు. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము, నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బిజెపి పార్టీ పటిష్టతకు ప్రతి కార్యకర్త సైనికుల పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు, కేశవపట్నం ఎంపీటీసీ 2 ఏనుగుల అనిల్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మాడ వెంకటరెడ్డి, అధికార ప్రతినిధి అలివేలి సమ్మిరెడ్డి, సీనియర్ నాయకులు పలకల రాజిరెడ్డి, దండు కొమురయ్య, శక్తి కేంద్రం ఇన్చార్జీలు, సుధ గోని శ్రీనివాస్, అన్నాడి మహేందర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి సంపత్, నాయకులు అంతం రాజిరెడ్డి, నరేందర్, నరేష్, శ్రీనివాసు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.




