ఎంఏ కైసర్ ఖాన్ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన కొత్తబావి సర్పంచ్ జబ్బు యాదయ్య యాదవ్ కొండమల్లేపల్లి డిసెంబర్ 29 జనం సాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి పట్టణ కేంద్రానికి చెందిన ఎమ్ ఏ ఖైసర్ ఖాన్ సతీమణి గత వారం రోజుల క్రితం అనారోగ్యంతో పరమపదించారు.వారికి ఒక కుమార్తె,కుమారుడు ఉన్నారు.ఆ చిన్నారులకు చేయూతగా మానవతా దృక్పథంతో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు కొత్తభావి సర్పంచ్ జబ్బు యాదయ్య యాదవ్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.20,000/-లు నగదు ఆర్ధిక సహాయం అందచేసారు ఈ సందర్భంగా కొత్తబావి సర్పంచ్ జబ్బు యాదయ్య యాదవ్ మాట్లాడుతూ ఒక మనిషి కష్టాల్లో,బాధల్లో ఉన్నప్పుడు సహాయం చేస్తే తిరిగి భగవంతుడు మనకు మన కుటుంబానికి మేలు చేస్తాడని మా నాన్నగారు చెప్పేవారని, కైసర్ ఖాన్ నాకు మంచి మిత్రుడు అని వారి కుటుంబానికి ఇలా జరగడం చాలా బాధాకరమని నాకు భగవంతుడు ఇచ్చిన దానిలో కొంత ఆర్థిక సహాయం చేశాను అని తెలిపారు జబ్బు యాదయ్య యాదవ్ చేసిన ఆర్థిక సహాయాన్ని ముస్లిం సోదరులు మరియు పట్టణ ప్రజలు అభినందించారు ఈ కార్యక్రమంలో కొండమల్లేపల్లి వార్డ్ సభ్యులు తోటపల్లి శ్రీనివాస్,బోడ రాములు,తిరందాసు మహేష్, చేపూరి కార్తీక్,పెద్దిశెట్టి మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఎంఏ కైసర్ ఖాన్ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన కొత్తబావి సర్పంచ్ జబ్బు యాదయ్య యాదవ్




