ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లకి పక్క భవనాలు నిర్మించాలి
బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్
రాజన్న సిరిసిల్ల బ్యూరో. డిసెంబర్ 29. (జనంసాక్షి) సంక్షేమ హాస్టళ్లకు పక్క భవనాలు ఏర్పాటు చేయాలని.బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం ఏర్పాటు చేసే సమావేశంలో రవి గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ బిసి హాస్టల్లకు పక్క భవనలను ఏర్పాటు చేయాలని, అలాగే చలి కాలం అయిపోతున్న కూడా ఇంకా దుప్పట్లు పంచడం లేదని వెంటనే దుప్పట్లను మంజూరు చేయాలని ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థులు పొద్దున లేసి కళాశాల కి పోవడం వల్ల చన్నిలతో స్నానాలకు ఇబ్బంది పడాల్సి వస్తుంది అని హాస్టల్ లో వున్న గ్రిజర్ లను వెంటనే బాగు చేయాలనీ డిమాండ్ చేశారు.అన్ని హాస్టల్ లలో నాణ్యమైన భోజనం అందించాలని అన్నారు.ఇంతకు ముందు వారం లో రెండు రోజులు గుడ్డు పెట్టేవారు అని ఇప్పడు ఒక్క రోజు మాత్రమే పెడుతున్నారు అని వెంటనే మెనూ ప్రకారం గా నాణ్యమైన భోజనము అందించాలని డిమాండ్ చేశారు. హాస్టల్ లలో వార్డెన్ లు లేకపోవడం వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది అని ఒక్కో వార్డెన్ కి 2నుండి 4 హాస్టల బాధ్యతలు ఇవ్వడం వల్ల ఇక్కడ కూడా సరిగా చూసుకోవడం లేదు అని వెంటనే అన్ని సంక్షేమ హాస్టల్ లో శాశ్వత వార్డెన్ లని నియమించలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇంచార్జీ ఇల్లందుల ప్రకాష్,మండల అధ్యక్షులు మట్టే నరేష్,పట్టణ అధ్యక్షుడు రుద్రవెని సుజిత్ కుమార్, హాస్టల్ ఇంచార్జీ నవీన్,నాయకులు శశాంక్,శివమణి,మనోజ్,క్రాంతి,విజయ్,వినాయక్, విద్యార్ధులు పాల్గొన్నారు.




