పెనుబల్లి, జనవరి 18(జనం సాక్షి)
తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్య మంత్రి, తెలుగు జాతి ఆరాధ్య దేవుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీ య నందమూరి తారకరామారావు 27వ వర్ధంతి వేడుకలను బుదవారం పెనుబల్లి మండలం లో ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా టేకుల పల్లి గ్రామంలో దుంపా ప్రసాద్ ఆధ్వర్యంలో ఎన్ టి ఆర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు, ఈ సంధర్భంగా ఎన్ టి ఆర్ అభమాను లు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు స్వచ్ఛమైన రాజకీయాలకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచార ని, తెలుగు జాతి ఖ్యాతిని ఖండాంతరాలుగా వ్యాపింపజేసిన నేత అని, రాజకీయాలకు కొత్త నిర్వచనం చెప్పిన ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతినిధిగా ఖ్యాతినార్జించారని, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుబడిన మహానేత ఎన్టీఆర్ అని ,ఎప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్తాయిగా నిలిచిపోతారని అన్నారు, తెలుగు తెరకు మకుటం లేని మహారాజు ఎన్టీఆర్ అని వెండితెరపై రాముడైనా, కృష్ణుడైన మరే పాత్ర అయినా ఎన్టీఆర్ చేసిన ఆ పాత్రకు నిండుదనం వచ్చేదని, సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చారని, నటుడిగా దర్శకుడిగా నిర్మాతగా రాజకీయ నాయకుడిగా ఎవరికి సాధ్యం కానీ రికార్డులను సృష్టించారన్నారు, కొన్ని వేల మందికి రాజకీయ బిక్ష ప్రసాదించారన్నారు, ఈ కార్యక్రమంలో సూర్య దేవర రవికుమార్, నల్లమోతు నాగేశ్వరావు, నంద్యాల మారేశ్వరావు, ఎస్ డి బాబు, రాజేశ్వరరావు, కోమటి నరసింహరావు, అంజయ్య, సర్నాల రాములు, తదితరులు పాల్గొన్నారు.




