ఎంజేర్ ట్రస్ట్ ఆఫీస్ ఎక్కడుందో చెప్తే,ఆర్టీఐ ఆక్ట్ కింద వివరాలు అడుగుతాం
బిఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు కొత్తపల్లి కుమార్….
నాగర్ కర్నూల్ రూరల్ నవంబర్ 23(జనంసాక్షి):జిల్లా కేంద్రంలోనీ సాయి గార్డెన్ లో బిఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో,బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ 55వ జన్మదినం సందర్బంగా మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బిఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు కొత్తపల్లి కుమార్ మాట్లాడుతూ,బహుజనుల భరోసా,పేద పిల్లల విద్యా పెన్నిధి,బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ జన్మదినం సందర్బంగా నియోజకవర్గంలోని బహుజన యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయం అన్నారు.బీసీ సమాజాన్ని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని తెలిపారు.ఎలాంటి ఉద్యమాలు లేకున్నా,7శాతం జనాభా ఉన్న(ఈబిసి)లకు 10శాతం రిజర్వేషన్ ఇవ్వడాన్ని ఎలా సమర్దించుకుంటారని ప్రశ్నించ్చారు.దేశంలో,రాష్ట్రములో జనాభాలో అత్యధికం ఉన్న బీసీలు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఈ మోసాన్ని ఎక్కడికి అక్కడ ఎండగట్టాలని కోరారు.అట్లాగే నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సేవ కార్యక్రమాలు ఎంజేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్నామని అంటున్నారు.ఎంజేర్ ట్రస్ట్ ఆఫీస్ ఎక్కడుందో చెబితే,ఆర్టీఐ ద్వారా వివరాలు అడుగుతామనీ అన్నారు.ఎంజేర్ ట్రస్ట్ కు ఎన్ని నిధులు వస్తున్నాయి,ఎంత ఖర్చు పెడుతున్నారో ప్రజలకు తెలుస్తుంది అనీ వివరించారు.రానున్న బహుజన రాజ్యంలో భూమి లేని ప్రతి నిరుపేదకు కనీసం ఒక ఎకరా భూమి ఇస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఎస్పీ జిల్లా అధ్యక్షులు అంతటి.నాగన్న,జిల్లా కార్యదర్శి బోనాసి.రాంచంద్రం,అసెంబ్లీ అధ్యక్షులు పృథ్వీరాజ్,నాయకులు శ్రీనివాస్,ఆనంద్,కళ్యాణ్,పరుశరామ్,లక్ష్మన్,శివశంకర్,సురేందర్,నాగేష్,రాంచందర్,రాముడు,రాజ్,మహేష్,శ్రీను,వెంకటేష్,మల్లేష్,విష్ణు,శంకర్,బాలరాజ్,శేఖర్ “సర్వీంగ్ హ్యాండ్స్”సభ్యులు సందీప్,వెంకట్ రెడ్డి,సుభాష్,శివ,శ్రీకాంత్,హర్ష లు పాల్గొన్నారు.




