బహుజన రాజ్యాధికారమే ఆర్ ఎస్ పీ లక్ష్యం..
ఊరుకొండ, నవంబర్ 23 (జనంసాక్షి):
బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా అహర్నిశలు కష్టపడుతున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఊర్కొండ, మిడ్జిల్ మండలాల ఇంచార్జ్ జంగిటి ఆంజనేయులు ప్రార్థించారు. బుధవారం ఊరుకొండ మండల కేంద్రంలోని కల్వకుర్తి – జడ్చర్ల ప్రహదాన రహదారిపై గల అంబేద్కర్ విగ్రహం వద్ద మండల బీఎస్పీ నాయకుల ఆధ్వర్యంలో.. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, బహుజన ముద్దు బిడ్డ, బీఏస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ గారి 55వ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఊర్కొండ, మిడ్జిల్ మండలాల ఇంచార్జ్ జంగిటి ఆంజనేయులు, బీఏస్పీ ఊర్కొండ మండల కన్వీనర్ లు దుబ్బ రాములు, అంకూరి హరీష్, మండల ప్రధాన కార్యదర్శి రవి, దుబ్బ నాగేష్,, బైండ్ల శ్రీశైలం, రవితేజ, రాజు, తదితరులు పాల్గొన్నారు.
బహుజన రాజ్యాధికారమే ఆర్ ఎస్ పీ లక్ష్యం




