ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు స్పష్టమైన ఆదేశాలు
ప్రజలను చైతన్యం చేసేలా కార్యక్రమాలు
హైదరాబాద్,ఏప్రిల్21(జనంసాక్షి): ప్రచండ భానుడు భగభగమంటున్నాడు. గత వారంరోజులుగా ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరుకోవడంతో ఎండవేడిమిని తట్టుకోలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 10గంటలు దాటితే రహదారులన్నీ కర్ఫ్యూ వాతావరణాన్ని తలిపిస్తున్నాయి. గతకొద్దిర రోజులుగా ఉష్ణోగ్రతల్లో మార్పులు రావడంతో పగటి ఎండలు పెరిగాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. వైద్యారోగ్యశాఖ ముందస్తు చర్యలకు సన్నద్దం అయ్యింది. వైద్యాధికారులు సిద్దంగా ఉండి తగు చర్యలు తీసుకోవాలసి చూసించింది. అలాగే పిహెచ్సి స్థాయిలో వైద్యులు తక్షణ వైద్య సేవలకు సిద్దంగా ఉండాలిన మంత్రి లక్ష్మారెడ్డి సూచించారు. వడదెబ్బ తదితర సమస్యలకు అవసరమైన మందులు సిద్దం చేసుకోవాలన్నారు. ఎండవేడిమికి ప్రజలు జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని వైద్యులు చెప్పకనే చెబుతున్నారు. ఎండలో సాధ్యమైనంత వరకు తిరగకూడదని, తప్పదనుకుంటే తలపాగా, టోపీ ధరించి వెళ్లాలి, వృద్ధులు, చిన్నారులు బయటకు వెళ్తే గొడుగును తప్పనిసరిగా ఉపయో గించాలి. చెమట రూపంలో శరీరంలోని నీరు బయటకు వెళ్లడం వల్ల డిహైడ్రేషన్ సమస్య ఏర్పడుతుంది. ఎక్కువగా మోతాదులో ఉప్పు కలిగిన ద్రవ పదార్ధాలను తీసుకోవాలి. ఎండ వేడిమిని తట్టుకునేందుకు శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే పండ్లు, పానీయాలు తీసుకోవాలి. తర్భూజా, దోసకాయలు, కొబ్బరిబొండాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎక్కువ సేపు ఎండలోప్రయాణం చేస్తే వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది. వీలైనంత తక్కువగా ప్రయాణాలను సాగించాలి. ఉదయం, రాత్రి సమయాలలోనే ప్రయాణాలు చేసి వడదెబ్బ నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అంటున్నారు. ఇకపోతే ఎండలు దంచి కొడుతుండ డంతో ఎవరు కూడా బయటకు రావడం లేదు. దీనికితోడు ప్రజలు రాక వ్యాపారాలు సాగక దుకాణౄలు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మూసేస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో జనం తల్లడిల్లిపోతున్నారు. బయటకు రావాలంటే నెత్తిన టోపీ, ముఖానికి దస్తీ చుట్టుకొని బయటకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత వారం రోజుల నుంచి 36 డిగ్రీల నుంచి 421డిగ్రీల వరకు పెరిగాయి. వేడిగాలుల ప్రభావం ఆరోగ్యంపై పడుతుందని, ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలని ముందస్తుగా వైద్యులు సూచనలు చేస్తున్నారు. అకాల వర్షాలతో వాతావరణంలో వచ్చిన మార్పులతో పగటి పూట ఉష్ణోగ్రతలు తగ్గడంతో మొన్నటి వరకు జనం ఊపరిపీల్చుకున్నారు. గత వారం రోజుల నుంచి మళ్ళీ ఎండలు మండిపోతుండటంతో పగలు వేడిగాలులతో భానుడు సెగలు కక్కుతున్నాడు. సాధారణంగా మే మాసంలో ఠారెత్తించాల్సిన ఎండలు ఈసారి ఫిబ్రవరి నెలలో మోస్తారుగా మొదలై మార్చి నెలలో ఎండలు అదరగొట్టాయి. ఏప్రిల్ ప్రారంభం నాటికి ఈ ఎండలు మరింతగా పెరిగటంతో రానున్న రోజుల్లో మరింత ఇబ్బందులు తప్పవని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. సింగరేణి కార్మిక ప్రాంతంలోని బొగ్గు గనుల్లో కార్మిక ప్రాంతం భగ్గుమంటోంది. కార్మికులు విధులకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఇప్పటికే కొత్తగూడెం జిల్లా కేంద్రంతో పాటు భద్రాచలంలో 43డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవ్వటంతో ఎండలకు తట్టుకోలేక
శీతపానియాలు తీసుకుంటున్నారు. ఆదిలాబాద్, వరంగల్, కరంనీరగ్ సింగరేణి ప్రాంతాల్లో ప్రజలు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో గ్రామాలు మొదలు, పట్టణాల వరకు రహదారులన్నీ కర్ఫ్యూను తలపిస్తున్నాయి. ఎండల ధాటికి ఉదయం 11గంటలలోపే రహదారులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. శుభకార్యాలు ఈ నెలలో ఎక్కువగానే ఉన్నప్పటికీ కుటుంబమంతా కలిసి వెళ్ళేందుకు ఈ ఎండల భయానికి జంకుతున్నారు. ఇకపోతే పలుచోట్ల స్వచ్చందసంస్థలు, ప్రజలు, ప్రభుత్వం పక్షాన పాదాచారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలీస్‌శాఖ, మున్సిపల్, స్వచ్ఛంద సేవాసంస్థలు, వ్యాపార వర్గాలు ఈ చలివేంద్రాలను అవరసమున్న చోట ఏర్పాటు చేయడంతో పాదాచారుల దాహార్తిని కొంతవరకు తీర్చుతున్నాయి. మూగజీవాలకు అవసరమైన నీటిని అందించేందుకు పలువురు ముందుకు వస్తున్నారు.




