Friday, 6 November 2026

ఎండీఆర్ హైస్కూల్ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్ కార్యక్రమం విజయవంతం

ఎండీఆర్ హైస్కూల్ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్ కార్యక్రమం విజయవంతం హుజూర్ నగర్ నవంబర్ 14 (జనం సాక్షి): హుజూర్ నగర్ పట్టణంలోని ఎండీఆర్ హై స్కూల్ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్ కార్యక్రమంను అంగరంగ వైభవంగా నిర్వహించామని ఎండీఆర్ స్కూల్ అధినేత మేరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. సోమవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు 250 మంది విద్యార్థినీ, విద్యార్థులు ఉపాద్యాయులుగా, వివిధ అధికారులుగా, నర్సరీ, ఎల్ కేజీ, యూకేజీ, 1,2,3, క్లాస్ విద్యార్థినీ, విద్యార్థులకు ఫ్యాన్సీ డ్రెస్సింగ్ కాంపిటీషన్ లో పాల్గొని కార్యక్రమంను విజయవంతం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ ప్రదర్శన కనపరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎండీఆర్ స్కూల్ ప్రిన్సిపాల్ నలబోలు భూపాల్ రెడ్డి, ఎఓ పింగళి నర్సిరెడ్డి, ఉపాధ్యాయినీ, ఉపాద్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.