రైస్ మిల్లర్ తో గద్ద పాక సహకార సంఘం చైర్మన్ కుమ్మక్కు…
సన్న రకం దాన్యం పంపిస్తే కమిషన్..
ట్రాక్టర్ కు 4200 కకమిషన్…
బయటపెట్టిన రైతు..
శంకరపట్నం: జనం సాక్షి నవంబర్ 14
ప్రభుత్వాన్ని నిబంధనలను, ఉత్తర్వులను తుంగలో తొక్కి రైస్ యజమానితో, కుమ్మక్కైన గద్దపాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్. చైర్మన్, రైస్ మిల్ యజమాని, అవినీతి ని రైతు బయట పెట్టిన రైతు సోమవారం కరీంనగర్ జిల్లా, శంకరపట్నం మండలం, గద్దపాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట రైతుల ఆధ్వర్యంలో భారీ నిరసన. ఈ సందర్భంగా రైతు పలుకల కొండాల్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉండేందుకు ప్రభుత్వము వరి ధాన్యము కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని, గద్దపాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రంలో చైర్మన్ గుర్రాల తిరుపతిరెడ్డి, సీఈవో శ్రీనివాస్, మొలంగూర్ శివారులోని బాలాజీ ఇండస్ట్రీస్, రైస్ మిల్ యజమానితో కుమ్మక్కై, సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తున్న సాంబ మసూరి, ఇతర సన్న రకాలను వరి ధాన్యాన్ని బాలాజీ ఇండస్ట్రీస్ కు దిగుమతి కోసం పంపిస్తూ, రైస్ మిల్లు యజమాని వద్ద 1 ట్రాక్టర్ ట్రిప్పుకు 4200 కమిషన్ పొందుతున్నట్లు రైతు కొండారెడ్డి వెల్లడించారు. ఈనెల 11న తనను దిగుమతి కోసం బాలాజీ ఇండస్ట్రీస్ కి వెళ్లాలని చైర్మన్ తిరుపతి రెడ్డి, హుకుం జారీ చేయడంతో, బాలాజీ ఇండస్ట్రీలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని, తను వేరే మిల్లుకు వెళ్తానని కోరిన చైర్మన్ తిరుపతి రెడ్డి నిరంకుశంగా వ్యవహరించి, తనను ఇబ్బందులకు గురి చేసినట్లు ఆరోపించారు. ఇట్టి విషయమై ఆరా తీయగా చైర్మన్ కు, మిల్లు యజమాని 1 ట్రాక్టర్ సన్నరకం వడ్లకు, 4200 కమిషన్ ఇస్తున్నట్లు వెల్లడైందని, సోమవారం సంఘం ఎదుట ఆందోళన నిర్వహించి, చైర్మన్ అవినీతిని బట్టబయలు చేసినట్లు వెల్లడించారు. చైర్మన్ మిల్లి యజమాని వ్యవహారంపై గ్రామంలోని ప్రాథమిక సహకార ఎదుట ఆందోళన నిర్వహించినట్లు వెల్లడించారు. కమిషన్ విషయమై సీఈఓ శ్రీనివాసుస్ వివరణ కోరగా తనకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. ఏది ఏమైనప్పటికీ సంబంధిత శాఖ అధికారులు ఇప్పటికైనా స్పందించి కొనుగోళ్లపై క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని రైతుల కూర్చున్నారు.
రైస్ మిల్లర్ తో గద్ద పాక సహకార సంఘం చైర్మన్ కుమ్మక్కు




