Tuesday, 3 November 2026

ఎంపి సురేశ్‌ రెడ్డికి కరోనా

హైదరాబాద్‌,నవంబర్‌11 (జనంసాక్షి) : టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు కేఆర్‌ సురేశ్‌ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. తాను క్షేమంగా ఉన్ననని, తనను గత 4-5 రోజులుగా కలిసిన వారందరూ టెస్ట్‌ చేయించుకోవాలిసిందిగా సురేశ్‌ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్‌ ద్వారా విజ్ఞప్తి చేశారు.

మరోవైపు, తెలంగాణలో గత రెండు రోజులుగా కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,196 కరోనా కేసులు నమోదు కాగా.. ఐదుగురు మృతి చెందారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటీవ్‌ కేసుల సంఖ్య 2,53,651కి చేరింది. 1,390 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 19,027 యాక్టివ్‌ కేసులుండగా.. చికిత్స నుంచి కోలుకుని 2,34,234 మంది డిశ్చార్జ్‌ అయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బుధవారం విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌లో పేర్కొంది. ఇప్పటివరకు తెలంగాణలో 47.29 లక్షల కరోనా టెస్టుల నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా కొత్తగా జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 192, మేడ్చల్‌ 101, రంగారెడ్డి 121 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.