ఎంపీ కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాజేందర్ నాయక్
టేకులపల్లి, జనవరి 1 (జనం సాక్షి): మహబూబాబాద్ పార్లమెంటు సభ్యురాలు మాలోతు కవిత జన్మదిన సందర్భంగా ఆదివారం ఎంపీ స్వగృహంలో టేకులపల్లి మండలంలోని మద్రాస్ తండా గ్రామపంచాయతీ సర్పంచ్, మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు మాలోతు రాజేందర్ నాయక్ బొకేలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తో పాటు నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలిపారు. అదేవిధంగా ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ కు బొకేలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తన గ్రామ పంచాయతీలోని చేపట్టాల్సిన అభివృద్ధి పనులను ఎంపీ, ఎమ్మెల్యేల దృష్టికి తీసుకువెళ్లారు.




