మోత్కూరు మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పొన్నేబోయిన రమేష్
మోత్కూరు జనవరి 1 జనంసాక్షి : మోత్కూరు మండల ప్రజలకు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పొన్నేబోయిన రమేష్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2023 నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుభిక్షంగా ఆయురారోగ్యాలతో, సుఖ సంతషాలతో ఉండాలని కోరారు. ఈ సంవత్సరం అంతా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కలకాలం వారి యొక్క కుటుంబాలతో సౌఖ్యంగా ఉండాలని ఆ భగవంతుని కోరినట్లు తెలియజేశారు. సీఎం కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి పథంలో ఎంతో ముందుకు తీసుకెళ్తుందని ఇలాంటి గొప్ప నాయకుడు మన రాష్ట్రానికి పరిపాలన అందించడం మన అదృష్టంగా భావించాలని అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తుంగతుర్తి శాసన సభ్యులు గాదరి కిశోర్ కుమార్ తుంగతుర్తి ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించాలని ఆయన కోరారు.




