బిఆర్ఎస్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు
రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : క్యాతన్ పల్లి మున్సిపాలిటీ రామకృష్ణాపూర్ పట్టణ బి.ఆర్.ఎస్ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, మున్సిపాలిటీ చైర్పర్సన్ జంగం కళ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగావారుమాట్లాడుతూ పట్టణ ప్రజలకు, పాలకవర్గానికి, పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఎర్రం విద్యాసాగర్ రెడ్డి, కౌన్సిలర్లు జాడి శ్రీనివాస్, పోగుల మల్లయ్య, పొలం సత్యం, గడ్డం సంపత్, సీనియర్ నాయకులు రామిడి కుమార్, గోపురాజం, యువ నాయకులు గంగారపు సత్యపాల్, సతీష్, ఎర్రబెల్లి రాజేష్, గౌస్, మణి , గోనే రాజేందర్, చంద్ర కిరణ్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




