పోస్టాఫీస్ లో రూ 399 కడితే పది లక్షల ప్రమాద భీమా
ఆత్మకూరు (ఎం) నవంబర్ 10 (జనంసాక్షి) పోస్టల్ శాఖలో అతి తక్కువ రూ 399 వార్షిక ప్రీమియంతో పది లక్షల ప్రమాద భీమా పథకంను ప్రవేశపెట్టారు 18 నుండి 65 సంవత్సరాల మద్య వున్న వారు ఈ పథకంకు అర్హులని ఆత్మకూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో పోస్టల్ సమావేశంలో సర్పంచ్ జన్నాయికోడె నగేష్ ముఖ్య అతిథిగా హాజరై తెలిపారు పోస్టల్ అసిస్టెంట్ మేనేజర్ శ్రావణి మాట్లాడుతూ భీమా దారుడు ప్రమాదంలో గాయపడి కాళ్లుచేతులు పొగొట్టుకున్నా 10 లక్షల భీమా వస్తుంది మృతి చెందితే వారి కుటుంబ సభ్యులకు 10 లక్షల భీమాను అందిస్తారు భీమా దారుడు 150కిలోమీటర్ల దూరంలో ప్రమాదానికి గురైతే రవాణా కోసం రూ 25 వేలను చెల్లిస్తుంది పోస్టల్ శాఖ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ టాటా ఏఐజి బజాజ్ అలియన్జ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలతో కలిసి ఈ పథకాన్ని అమలు చేస్తుందన్నారు అలాగే రూ 299కు కూడా ప్రమాధ భీమా పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పోస్ట్ మాస్టర్ అమర్నాథ్ పోస్టల్ సిబ్బంది మరియు అఖిలపక్ష నాయకులు పోతగానీ మల్లేశం జన్నాయికోడె రాములు ఎలగందుల శ్రీనివాస్ శ్రీనివాస్ తవిటి వెంకన్న తొండల అనిల్ లోడి మహేశ్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు




