Friday, 6 November 2026

ఎంపీ బండి సంజయ్ కి వినతిపత్రం అందజేత

ఎంపీ బండి సంజయ్ కి వినతిపత్రం అందజేత*
మెట్పల్లి టౌన్, డిసెంబర్ 09, జనంసాక్షి:
దళిత సమైక్య ప్రజా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం రోజున
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మెట్పల్లి నుండి పాదయాత్ర లో భాగంగా , ఆయనను మెట్పల్లి పట్టణ కేంద్రంలో మర్యాదపూర్వకంగా, దళిత సమైక్య ప్రజా సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పులింటి స్వామి కుమార్ కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది,
ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ త్వరగా చేపట్టాలని అందులో ఎస్సీ 57,వెనుకబడిన కులాల వారికి తగు ప్రాధాన్యత ఇవ్వాలని మరియు విద్యా ఉద్యోగంలో రిజర్వేషన్ జనాభా ప్రతి పాదికన ఇవ్వాలని, ఎస్సి 57 వెనుకబడిన కులాలకు చిందులు, దక్కలి, మిత్రా అయ్యేవాళ్ళు, మోచి, బేడ, బుడిగ జంగం, హాలియా దాసరి, ఇలాంటి కులాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి వారికి పక్క ఇండ్లు కళాకారులకు ప్రత్యేక పింఛన్ ఇప్పించేలా కృషి చేయాలని వినతి పత్రం అందించారు,ఈ కార్యక్రమంలో దళిత సమైక్య ప్రజా సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పులింటి డాక్టర్ స్వామి కుమార్, గడ్డం సుదర్శన్, రామచంద్ర, రవి ,బోడయ్య,రాజేశ్వర్ ,విట్టల్ ,భూమేశ్వర్, భుజంగం, మురళి ,అంజయ్య, రాఘవులు, కుమారస్వామి, సమ్మయ్య పాల్గొని వినతిపత్రం ఇచ్చారు .