పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు
జనం సాక్షి, డిసెంబర్ 09,భువనగిరి న్యూస్ :
ఈరోజు భువనగిరి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం దగ్గర కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడుతూ సోనియాగాంధీ వలన తెలంగాణ ఏర్పడిందని ఎంతోమంది విద్యార్థుల బలిదానాల వలన చలించిపోయిన సోనియా గాంధీ వెంటనే పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగిందని, తెలంగాణ రాష్ట్రాన్ని విభజించడం వలన ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నష్టం జరుగుతుందని తెలిసిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగిందని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ పాలన అందుకు విరుద్ధంగా పాలిస్తూ బంగారు తెలంగాణ అంటూ పేరుకే గొప్పలు చెప్పుకుంటూ ఎంతోమంది విద్యార్థులు నిరుద్యోగం వలన ఆత్మహత్యలు చేసుకోవడం జరిగిందని, రైతులకు తీవ్ర నష్టం కలిగిందని తెలంగాణ రావడం వలన కేసీఆర్ కుటుంబానికి తప్ప తెలంగాణ ప్రజలకు ఎటువంటి లాభం లేదని సోనియా గాంధీ రెండు సార్లు ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసిన ఘనత సోనియా గాంధీని కెసిఆర్, మోడీ ప్రభుత్వాలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా పాలన సాగిస్తున్నారని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించి పలు రాష్ట్రాలలో ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బిజెపి పైన గెలుపొందడం జరిగిందని రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో తేవడానికి శాయశక్తుల కంకణబద్ధులై కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసు కుంట్ల సత్యనారాయణ, తంగళ్ళపల్లి రవికుమార్, పోత్నాక్ ప్రమోద్ కుమార్, బర్రె జహంగీర్, ఎండి మజాహర్, అంగడి నాగరాజ్, బెండ శ్రీకాంత్, ఎండి రఫీ, యుద్దీన్, గౌరీ కైరం కొండ వెంకటేష్ కృష్ణ యాదవ్ పడిగల ప్రదీప్, కోళ్ల గంగాధర్, పిట్టల బాలరాజ్, తాడూరి నరసింహ, ఎండి నజీర్, మహిళా నాయకురాలు ఝాన్సీ, గుండు జ్యోతి, గుర్రం శ్రీనివాస్, తాడూరి బాలరాజ్, పోకల యాదగిరి, జిట్ట మల్లారెడ్డి, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.




