ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు
కొడకండ్ల, డిసెంబర్09( జనం సాక్షి )
కొడకండ్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో
సోనియాగాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించి, సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, కేక్ కటింగ్ చేశారు. అనంతరం కొడకండ్ల మండల కేంద్రంలో ఉన్న స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి లో రోగులకు , గర్భిణీ స్త్రీలకు
పండ్లు,మిఠాయిలు పంచిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.
అనంతరం మండల పార్టీ అధ్యక్షుడు ధరావత్ సురేష్ నాయక్,పాలకుర్తి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ధరావత్ రాజేష్ నాయక్ మాట్లాడుతూ రాబోయే రోజులల్లో తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావాలని, తెలంగాణ తల్లి సోనియాగాంధీ రుణం తీర్చుకునే బాధ్యత తెలంగాణ ప్రజల అందరి పై ఉన్నది అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంత కష్టపడి కాంగ్రెస్ పార్టీని అధికారం లోకి తీసుకురావలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నూనె ముంతల సోమ నరసయ్య, కొడకండ్ల పట్టణ అధ్యక్షులు మసురం రవీందర్ పాలకుర్తి నియోజకవర్గం యూత్ అధ్యక్షులు ధరావత్ రాజేష్ నాయక్, ఎస్సీ సెల్ అధ్యక్షులు ధర్మారపు బిక్షపతి, మండల బీసీ సెల్ అధ్యక్షులు వల్లబోజు రమేష్, మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు జాటోత్ రాహుల్ నాయక్, మండల యువజన విభాగం అధ్యక్షులు దూదిమెట్ల యాకన్న, పాలకుర్తి నియోజకవర్గం యూత్ నాయకులు జాటోతు రాము నాయక్ నరసింహ నాయక్, తోట కరుణాకర్, మసురం మనోహర్, మండల కార్యదర్శి ఐతరాజు , ధరావత్ హేమాని నాయక్ , బానోతు యాకూబ్ నాయక్ దోర్నం సోమయ్య, నర్సింగాపురం గ్రామ పార్టీ అధ్యక్షులు సోమారపు ఐలయ్య సంజీవ అయితే రాజు రాజు ,సోమయ్య, నర్సింగరావు, సోమయ్య నాయక్,ధరవత్ రవి ,భూక్య శ్రీను,దేవేందర్, సోమన్న హుస్సేన్ నజీర్, ఉల్లి ఆంజనేయులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




