టేకులపల్లి, జూన్ 5( జనం సాక్షి ): పార్లమెంటు సభ్యులు మీడియం బాబురావు పాస్టర్లపై బుల్లెట్లు దించుతామని చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, చేసిన అనుచిత వ్యాఖ్యలకు పాస్టర్ లందరికీ క్షమాపణలు చెప్పాలని పాస్టర్ల సంఘం జిల్లా నాయకులు బల్లెం చిట్టిబాబు అన్నారు. టేకులపల్లి మండల కేంద్రంలోని చర్చిలో పాస్టర్స్ సోమవారం జిల్లా నాయకులు బల్లెం చిట్టిబాబు ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నూతన కమ్మిటి మండల పాస్టర్స్ కమిటీని పాస్టర్ సంధ్యారాణి చర్చిలో ఎన్నుకున్నారు. మండలం పాస్టర్స్ అధ్యక్షులు గా బల్లెం జాన్ రాజ్ ని, ఉపాధ్యక్షులు పాస్టర్ రాజు, కోశాధికారి హానోకు, పిల్లి అబ్రాహాము, బోయాజు, టేకులపల్లి మండల పాస్టర్స్ కమిటీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఈ సమావేశంలో చిట్టిబాబు మాట్లాడుతూ పాస్టర్ లందరూ పేద కుటుంబాలకు చెందిన వారు కాగా వారందరికీ ప్రభుత్వం గుర్తించి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంజూరు చేయాలని, దళిత పాస్టర్లకు దళిత బంధు మంజూరు చేసి ఆదుకోవాలని ఈ సమావేశంలో తీర్మానం చేస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ సమావేశంలో మండలంలోని పాస్టర్లందరూ హాజరయ్యారు.
ఎంపీ బాబురావు పాస్టర్స్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి పాస్టర్స్ జిల్లా నాయకులు బల్లెం చిట్టిబాబు




