Wednesday, 4 November 2026

ఎం ఎల్ ఏ. సండ్ర, కలెక్టర్ గౌతమ్ కు కృతఙ్ఞతలు తెలిపిన పంతంగి

పెనుబల్లి, జూన్ 6(జనం సాక్షి)ఎమ్యాల్యే సండ్ర, కలెక్టర్ గౌతమ్ లకు పుష్ప గుచ్చాలతో కృతజ్ఞతలు తెలిపిన రజక సంఘం నాయకులు పంతంగి వేంకటేశ్వరావు,
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సత్తుపల్లి లో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన దశాబ్ది సంబరాలకు ముఖ్య అతిధులుగా ఎమ్యాల్యే సండ్ర , ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ హాజరైయ్యారు. ఈ సందర్భంగా రజకులకు, నాయి బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ అందించడం పట్ల ఎమ్యాల్యే సండ్రకు, కలెక్టర్ గౌతమ్ కు పెనుబల్లి కి చెందిన రజక సంఘం నాయకులు పంతంగి వెంకటేశ్వరావు పుష్ప గుచ్చాలు అందించి కృతజ్ఞతలు తెలిపారు.