రాజన్న సిరిసిల్ల బ్యూరో. జూన్ 6. (జనంసాక్షి). తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పరిశ్రమల ప్రగతిపై మంగళవారం కలెక్టర్ కార్యాలయ సముదాయంలో నిర్వహించిన వేడుకల్లో చేనేత కళాకారుడు హరి ప్రసాద్ రూపొందించిన చేతిమగ్గం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చేతిమగ్గంపై దశాబ్ది ఉత్సవాల లోగోను నేసినట్లు ఈ సందర్భంగా చేనేత కళాకారుడు హరిప్రసాద్ తెలిపారు.
దశాబ్ది వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణ.గా హరి ప్రసాద్ చేతి మగ్గం.




