Wednesday, 4 November 2026

పురాతన బావులను సంరక్షించి వర్షపు నీటిని ఆదా చేయాలి : కలెక్టర్ వల్లూరి క్రాంతి

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి జూన్ 6) : జిల్లాలో ఉండే పురాతన బావులను సంరక్షించి వర్షపు నీటిని ఆదా చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.మంగళవారం హైదరాబాద్ కు చెందినది రైన్ వాటర్ ప్రాజెక్ట్ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో ఉండే పురాతన బావులను పరిశీలించారు. పురాతన బావుల సంరక్షణ నీటి నిల్వ గురించి సంస్థ ప్రతినిధి కల్పనా రమేష్ తమ సంస్థ ద్వారా పురాతన బావుల సంరక్షణ, వర్షపు నీటి ఆదాచేయుట గురించి కలెక్టర్ గారికి వివరించారు. ఈ సందర్బంగా గద్వాల పట్టణంలోని నది అగ్రహారం రోడ్డు ఆంజనేయ స్వామి గుడి పక్కన గల పురాతన బావిని జిల్లా కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పట్టణంలోని పురాతన బావులను సంరక్షించి వర్షపు నీటిని సంరక్షించడం, ఆర్చి నుండి ముఖ ద్వారం దగ్గర మెట్లు కనిపించే వరకు మట్టి తీసివేయాలని, బావిలో పూడికతీయుట, కంపచెట్ల తొలగించి మొత్తం క్లీన్ చేసి ప్లాంటేషన్ చేయుటకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని పురాతన బావుల సంరక్షణ వర్షపు నీటి సంరక్షణ కొరకై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.ఈ సమావేశంలో మున్సిపల్ కమీషనర్ నర్సిములు , ది రైన్ వాటర్ ప్రాజెక్ట్ హైదరాబాద్ కల్పన రమేష్ , సంబందిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.