Sunday, 8 November 2026

ఎం డి ఆర్ పాఠశాలలో ఘనంగా మ్యాథమెటిక్స్ డే సెలబ్రేషన్స్

ఎం డి ఆర్ పాఠశాలలో ఘనంగా మ్యాథమెటిక్స్ డే సెలబ్రేషన్స్
హుజూర్ నగర్ డిసెంబర్ 22 (జనంసాక్షి): హుజుర్ నగర్ పట్టణంలోని ఎండీఆర్ హై స్కూల్ నందు నేషనల్ మ్యాథ్స్ డే సెలబ్రేషన్స్ ను పాఠశాల చైర్మన్ మేరెడ్డి దామోదర్ రెడ్డి, ప్రిన్సిపాల్ భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హుజుర్ నగర్ సి ఐ రామలింగారెడ్డి, ఎస్బిఐ మేనేజర్ జి. వెంకటేశ్వరరావు, ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ లు పాల్గొని విద్యార్థులు తయారు చేసిన మ్యాథ్స్ ప్రాజెక్ట్ లనూ వీక్షించి వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు చక్కగా చదివి మంచి భవిష్యత్ నూ ఏర్పాటు చేసుకోవాలనీ అన్నారు. ఈ కార్యక్రమం లో సి ఆర్ పి సైదులు, మ్యాథ్స్ ఉపాధ్యాయులు కృష్ణ, షబానా, వినోద, వరలక్ష్మి, కృషవేణి, లక్ష్మికుమారి, పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు