Sunday, 8 November 2026

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పారదర్శకంగా ఎంపిక చేయండి

యదాద్రిజిల్లా తుర్కపల్లి మండలం జనంసాక్షి న్యూస్ డిసెంబర్22//టైటిల్ ;డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పారదర్శకంగా ఎంపిక చేయండి. ఫొట్ రైటప్01 తుర్కపల్లి గ్రామ సభలో మాట్లాడుతున్న స్పెషలాఫీసర్
తుర్కపల్లి అధికారులతో మొరపెట్టుకుంటున్న గ్రామస్తులు.
తుర్కపల్లి మండల కేంద్రంలో నిర్మాణం చేపట్టిన నలబై డబుల్ బెడ్ రూమ్ ల ఇండ్లను అర్హులైన నిరుపేదలను పారదర్శకంగా సర్వే నిర్వహించి ఎంపిక చేయాలని గ్రామస్తులు అధికారులతో మొరపెట్టుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాజకీయాలకు ఒత్తిడి లకు లొంగకుండా ఇండ్లు లేని నిరుపేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని కోరారు. మండల కేంద్రంలోని జె.యం ఫంక్షన్ హాల్ లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఎంపిక నియామక గ్రామసభను ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, మండల స్పెషల్ ఆఫీసర్ శ్యాంసుందర్ , తహసిల్దార్ బ్రహ్మయ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఎంపికలో ఎలాంటి ఒత్తిళ్లకు తావివ్వకుండా పారదర్శకంగా నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసి ఇండ్లను కేటాయిస్తామని పేర్కొన్నారు. 176 మంది అర్జీదారులు ఉండగా 37 మందిని ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. 37 మందిలో అర్హులు కాని వారిని తొలగించి ఇండ్లు లేని నిరుపేదలను ఎంపిక చేసి రెండో గ్రామ సభలో నివేదికలను చదువుదామని పేర్కొన్నారు. నిరుపేదలైన అర్హులకే డబుల్ బెడ్ రూములు కేటాయిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ బికు నాయక్, ఎంపీపీ భూక్య సుశీల రవీందర్ నాయక్, సింగిల్ విండో చైర్మన్ సింగిరెడ్డి నరసింహారెడ్డి, వైస్ ఎంపీపీ శ్రీనివాస్, ఎంపీటీసీ బోరెడ్డి వనజ హనుమంతు రెడ్డి, స్థానిక సర్పంచ్ పడాల వనిత శ్రీనివాస్, డిటి కల్పన, కార్యదర్శి శైలజ తదితరులు పాల్గొన్నారు.