నాగర్ కర్నూల్ ఆర్సీ జూలై 6(జనంసాక్షి):వికలాంగులకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి సహాయ సహకారాలు అందించినందుకు జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు కందనూలు నిరంజన్ కు”ఎక్సలెన్స్ అవార్డు-2023″రావడం అభినందనీయమని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఇండియా నాగర్ కర్నూల్ టౌన్ ప్రెసిడెంట్ భీమ్ సాగర్ అన్నారు.తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమితి హైదరాబాద్ వారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులకు సేవ పలు సహాయ సహకారాలు అందిస్తున్న వారిపై సర్వే నిర్వహించి బుధవారం సాయంత్రం హైదరాబాద్ రవీంద్రభారతిలో అవార్డు అందజేసి ఘనంగా సన్మానించారని అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,నాగర్ కర్నూల్ జిల్లాలో గత పది సంవత్సరాల నుంచి వికలాంగులకు ఎన్నో సహాయ,సేవా కార్యక్రమం నిర్వహించి వికలాంగుల అభ్యున్నతి కృషి చేస్తున్నారని అన్నారు.ఇలాంటి వ్యక్తులకు అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో బాలపిరు,కాశన్న,శ్రీలక్ష్మి,మంగమ్మ,నాగరాజు,చెన్నమ్మ,నిరంజన్ సాగర్,అంజనమ్మ,తదితరులు పాల్గొన్నారు.




