Tuesday, 3 November 2026

ఎక్సలెన్స్ పత్రాన్ని అందుకున్న ఐసీటీసీ డాక్టర్

 

 

 

 

 

 

 

యైటీంక్లయిన్ కాలని మే 04 (జనంసాక్షి) :గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఐసిటిసి కేంద్రంలో సేవలు అందిస్తున్నందుకుగాను జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (నాకో) తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (టిసాక్స్) ద్వారా ఫైవ్ స్టార్ నాణ్యత ప్రమాణాలు కలిగిన కేంద్రంగా సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెన్స్ పత్రాన్ని ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ దయాల్ సింగ్, ఐసిటిసి ఇంచార్జ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అరుణ ఆర్ ఎంఓ అప్పారావు చేతుల మీదుగా ఫైవ్ స్టార్ పత్రాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐసిటిసి ల్యాబ్ టెక్నీషియన్, టి. శ్రీనివాస్, ఐసిటిసి కౌన్సిలర్ కట్కూరి శంకర్, పిపిటిసి టి కౌన్సిలర్ ఏ. విజయలు పాల్గొన్నారు.