భైంసా రూరల్ మే 03 జనం సాక్షినిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం గ్రామపంచాయతీ కార్మికులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ పారిశుద్ధ కార్మికులకు వెయ్యి రూపాయల వేతనం పెంచుతూ సచివాలయంలో మొదటి సంతకం చేసినందుకు కృతజ్ఞతలతో పాలాభిషేకం చేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో బాసర గ్రామ పారిశుద్ధ కార్మికులు నాగేష్, కిరణ్, గంగాధర్, దేవన్న, భారత్ భాయ్, భోజన్న, నవీన్ తదితరులు పాల్గొన్నారు.




