రాజన్న సిరిసిల్ల బ్యూరో. మే 4. (జనంసాక్షి). కొనరావుపేట్ మండలం మల్కాపేట్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో భూములు కోల్పోయిన తమకు పూర్తిస్థాయిలో పరిహారం ఇవ్వకపోవడంపై నిర్వాసిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం సిరిసిల్లలో ఏర్పాటుచేసిన సమావేశంలో నిర్వాసిత రైతులు మాట్లాడుతూ మల్కాపేట్ బ్యాలెన్స్ రిజర్వాయర్లో నిజామాబాద్ గ్రామానికి చెందిన తాము భూములు లాగేసుకున్న ప్రభుత్వం పూర్తిస్థాయిలో పరిహారం ఇవ్వలేదని అన్నారు. అధికార పార్టీ ఎంపీపీ చంద్రయ్య డబ్బులు ఇస్తేనే పరిహారం ఇస్తామంటూ భూములు కోల్పోయిన తమతో వ్యవహరించిన తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో కలెక్టర్ విచారణ జరిపి తమకు తగిన విధంగా న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో టిడిపి చేనేత సెల్ నాయకులు రిక్కుమల్లె మనోజ్, నిర్వాసిత రైతులు కస్తూరి నారాయణ, శంకరయ్య, దేవయ్య, ప్రమీల, మల్లయ్య, రామయ్య తదితరులు పాల్గొన్నారు.




