
వికారాబాద్ రూరల్ జూన్ 23 (జనం సాక్షి)9వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నవాబుపేట మండల కేంద్రంలో ఈత వనం నాటడానికి సంకల్పించడం జరిగిందని ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా శుక్రవారం నవాబుపేట మండలంలోనీ గీతా కార్మికుడు కిష్టయ్య పొలంలో (100)ఈత చెట్టు మొక్కలను నాటడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్ నవీన్ చంద్ర, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్ శ్రీనివాస్ రెడ్డి, వికారాబాద్ సీఐ కె. రాఘవీణ, ఎస్ ఐలు వీరంజనేయులు, వాణి, ఇతర ఎక్సైజ్ సిబ్బందితో పాటు వికారాబాద్ జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు మల్లికార్జున గౌడ్ మరియు ఇతర గౌడ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు, ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపింటెండెంట్ డాక్టర్. నవీన్ చంద్ర మాట్లాడుతూ తెలంగాణకు హరిత హారంలో భాగంగా ఈ సంవత్సరం ఎక్సైజ్ శాఖ అధ్వర్యంలో సుమారు 35800 ఈత మొక్కలను పెంచడం లక్ష్యం గా నిర్దేశించుకున్నట్లు తెలిపినారు.




