గుంటూరు,అక్టోబర్30(జనంసాక్షి):మంగళగిరి మండలం ఎర్రబాలెం బండి వారి వీధి సెంటర్లో ప్రధాన రహదారి ప్రక్కనే మంగళవారం తెల్లవారుజామున ఇండిక్యాష్ ఏటీయంలో నగదు చోరీ చేసేందుకు దుండగులు విఫలయత్నం చేశారు. తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో గుర్తుతెలియని దుండగులు ఏటీయంలోకి చొరబడి ముందు రెండు సీసీ కెమెరాలను పగలగొట్టారు. ఆ తరువాత ఏటీయంను ద్వంసం చేసి నగదును దొంగిలించేందుకు ప్రయత్నం చేశారు. దుండగులు అన్ని విధాల ప్రయత్నం చేసిన వారి ప్రయత్నాలు విఫలం కావడంతో అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఏటీఎంలో నగదును తీసుకునేందుకు వచ్చిన ఖాతాదారులు గమనించి చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించినట్లు గ్రామస్తులు తెలిపారు.




