Wednesday, 4 November 2026

ఎనిమిది వందల కోట్లకు చేరిన ప్రపంచ జనాభా

ఎనిమిది వందల కోట్లకు చేరిన ప్రపంచ జనాభా
నవంబర్ 15 జనం సాక్షి భైంసా రూరల్
నిర్మల్ జిల్లా ,మండల కేంద్రమైన ముధోల్ లోని రబింద్రా ఉన్నత పాఠశాల విద్యార్థులు 800 కోట్ల ఆకారంలో కూర్చుని ప్రపంచ జనాభా పెరుగుతున్న చిత్రాన్ని సూచించారు. నవంబర్ 15 నాటికి ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకుందని డబ్ల్యూహెచ్వో వెల్లడించింది. ఈ సందర్భంగా విద్యార్థులుఎనిమిది వందల కోట్ల ఆకారంలో కూర్చోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ అసంవార్ సాయినాథ్ మాట్లాడుతూ జనాభా పెరుగుతూ ఉంటే ప్రకృతి ,అడవులు నాశనం అవుతాయని పేర్కొన్నారు. ఫలితంగా అనేక మహమ్మారిలు మానవులపై విజృంభిస్తాయని, వాతావరణం దెబ్బతింటుందని, ఆకలి, పేదరికం, నిరుద్యోగం పెరిగి పోతుందని వెల్లడించారు. మానవులలో పోషకాహారం లోపించి అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వెల్లడించారు. మనవుల జీవనం పెనుసవాలుగా మారిపోతుందని అన్నారు. జంతువులకు సైతం ఇబ్బందులు తప్పవన్నారు. రాను రాను అడువులు సైతం తగ్గిపోతున్నాయని వెల్లడించారు. జనాభా పెరుగుదల ప్రస్తుత ప్రపంచానికి పెను సవాలుగా మారిందని వివరించారు.ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ రాజేందర్, డైరెక్టర్ పోతున్న యాదవ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు, పాల్గొన్నారు.