Wednesday, 4 November 2026

జెడ్పి చైర్ పర్సన్ ను కలిసిన మండల నాయకులు

జెడ్పి చైర్ పర్సన్ ను కలిసిన మండల నాయకులు*
******
సైదాపూర్ జనం సాక్షి నవంబర్15జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమల్ల విజయను కరీంనగర్ పట్టణంలోని నివాస గృహంలో మండల నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా సైదాపూర్ మండల అభివృద్ధి కోసం జడ్పీ ద్వారా నిధులు కేటాయించాలని వారు విజ్ఞప్తి చేశారు.హుస్నాబాద్ శాసనసభ్యులు ఒడితల సతీష్ కుమార్ కేటాయించిన నిధులతో జరుగుతున్న అభివృద్ధితో పాటు జెడ్పీ ద్వారా కొన్ని నిధులు కేటాయిస్తే గ్రామాలు అభివృద్ధి పథంలో ఉంటాయని వారు కోరారు. దీనిపై స్పందించిన జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ తప్పకుండా తమ వంతు సహకారం అందించి సైదాపూర్ మండలానికి నిధులను కేటాయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం జడ్పీ చైర్ పర్సన్ ను నాయకులు శాలువాతో సత్కరించి పూల మొక్కను అందించారు. జడ్పి చైర్ పర్సన్ ను కలిసిన వారిలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సోమారపు రాజయ్య, సర్పంచ్ల ఫోరం మండల కార్యదర్శి, లస్మన్నపల్లి సర్పంచ్ కాయిత రాములు, నాయకులు రేగుల అశోక్, కిటకిట రాజు లు ఉన్నారు.