Wednesday, 4 November 2026

ప్రెస్ క్లబ్ అధ్యక్షుడుగా భూపాల్ :శామీర్ పేట్

ప్రెస్ క్లబ్ అధ్యక్షుడుగా భూపాల్ :శామీర్ పేట్, జనం సాక్షి :శామీర్ పేట ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ ప్రత్యేక సమావేశం మంగళవారం రోజు నిర్వహించారు . ఈ సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. నూతన అధ్యక్షుడిగా రాజిగల్ల భూపాల్ (సాక్షి) , ఉపాధ్యక్షుడిగా బత్తుల ప్రభాకర్ యాదవ్ (జనంసాక్షి), ప్రధాన కార్యదర్శిగా సింగం పవన్ కుమార్ (నవ తెలగాణ), కోశాధికారిగా క్యాథం రవి (ప్రజాపక్షం), ముఖ్య సలహాదారులు దేశం కృష్ణ (వార్త), బండి శ్రీరాములు (ఈనాడు) , వాసాలమర్రి నర్సింహ రావు (ఆంధ్రజ్యోతి), విలాసాగరం గిరి ప్రసాద్ (ఆంధ్రప్రభ), కార్యవర్గ సభ్యులు సింగిరెడ్డి వెంకట్ రెడ్డి (మన తెలంగాణ), బొమ్మేర్ల శ్రీకాంత్ (నమస్తే తెలంగాణ)లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
15ఎస్పీటీ -1: నూతన కమిటీని ఎన్నుకున్న సభ్యులు