Wednesday, 4 November 2026

ఎన్ఈపీ సీపీఎస్ లను రద్దు చేయాలి

 

 

 

 

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): ఉద్యోగ ఉపాధ్యాయుల నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలో జరిగిన టీఎస్ యుటిఎఫ్ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఎన్ఈపీ, సీపీఎస్ లను రద్దు చేయాలని ఈ నెల 24న ఎస్టీఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగే ఛలో పార్లమెంట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించాలని కోరారు.ఈ సమావేశంలో సంఘ జిల్లా అధ్యక్షులు ఎన్.సోమయ్య , ప్రధాన కార్యదర్శి ఎస్.అనిల్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, అరుణ భారతి, వెంకటయ్య,ఎస్ కె సయ్యద్, వీరారెడ్డి, పాపిరెడ్డి, రమేష్ , ఆడమ్, అనిల్ కుమార్, జనార్ధన రావు , రమేష్, క్రాంతి ప్రభ, శ్రీనివాసా చారి, లాలు, శ్రీను, రమేష్, శీనయ్య , సైదా, బాలాజీ, అనిత, అక్కయ్య బాబు, నరేందర్, పిచ్చయ్య, రవీందర్, రాంజీ తదితరులు పాల్గొన్నారు.