.
–
అభినందించిన ప్రిన్సిపాల్ ఐనాల సైదులు.ఫొటో : పేరెంట్స్ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న ప్రిన్సిపాల్.
బెల్లంపల్లి, ఫిబ్రవరి 11, (జనంసాక్షి )మా బిడ్డల భవిష్యత్తుకు పాటుపడుతున్న ఉపాధ్యాయులను ఎన్నటీకీ మరువమనీ అదేస్థాయిలో గురుకుల అభివృద్ధికి మావంతుగా తోడ్పాటునందిస్తామని పేరెంట్స్ ముందుకొచ్చారు. శనివారం తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సీ(సిఓఈ) బెల్లంపల్లి పేరెంట్స్ సమావేశం ప్రిన్సిపాల్ ఐనాల సైదులు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పేరెంట్స్ స్వయంగా ముందుకొచ్చి తమ గురుకులాన్ని తామే అభివృద్ధి చేసుకుంటామని ప్రకటించారు. అంతేకాకుండా తాత్కాలికంగా సిఓఈ అభివృద్ధి కమిటీ పేరుతో కొందరు బృందంగా ఏర్పడి తమకు తోచినంత సహాయాన్ని సేకరించి నిధిగా జమచేయాలని నిర్ణయించుకున్నారు. గురుకుల అభివృద్ధికి మేము సైతం అంటూ ముందుకొచ్చిన పేరెంట్స్ ను ప్రిన్సిపాల్ అభినందించారు. పిల్లల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దే బడి బాగుకోసం పేరెంట్స్ స్వచ్చందంగా రావడం పట్ల అర్సీఓ కొప్పుల స్వరూపరాణి ఫోన్ ద్వారా అభినందించారు. బెల్లంపల్లి బాలుర గురుకుల పేరెంట్స్ నిర్ణయం భవిష్యత్తులో ఎందరికో ఆదర్శమవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఇలా పాజిటివ్ గా ఆలోచిస్తే మన గురుకులాలను మనమే అభివృద్ధి చేసుకోవచ్చునని అమె సూచించారు. ఈ సమావేశంలో ముందుగా అంబేడ్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సబ్జెక్ట్ టీచర్స్ తరగతులవారీగా విద్యార్ధుల ప్రగతిని వెల్లడించారు. విద్యార్ధుల ప్రాధమిక అంశాలపై గురుకులంలో జరుగుతున్న ఎఫెల్ఎన్ ( ఫౌండేషన్ లిటరసీ న్యుమరసి) ప్రత్యేక కార్యక్రమం గురించి జెవిపి దాసం అజిత వివరించారు. ఈకార్యక్రమంలో అధ్యాపకులు, ఉపాధ్యాయులు, పేరెంట్స్ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు దాగం మహేష్, రేణికుంట్ల సరిత- శంకర్, పెరుగు తిరుపతి, కొమ్ము నరేష్, కె మహేందర్,ఎ అధిత్ నందన్, కొండ రాజయ్య, ఎల్ శ్రీనివాస్, ఇప్పరవి, లింగయ్య, భాగ్య, డి అశోక్, కవిత, తుంగపిండి శ్రీనివాస్, వెంకట స్వామి జాడి, జమ్మిశ్రీనివాస్, గోగర్ల రమేష్, ఏల్పుల రాజేందర్, బండారి రవి, మనుగు భాస్కర్, పొత్తుల స్వర్ణ, రాజులదేవి, పుదారి నగేష్ గౌడ్, జయశ్రీ, డి తిరుపతి, విద్యార్ధుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.




