Wednesday, 4 November 2026

బిల్లులు రాక గొల్లుమంటున్న సర్పంచులు

సొంత పార్టీపై అసహనం వ్యక్తం చేస్తున్న పలు సర్పంచులు
బిచ్కుంద జనవరి 26 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామ పంచాయతీ సర్పంచులు సొంత పార్టీ సర్కారు మీద నారాజ్‌ గున్నరు. ఊరికి సర్వీస్‌ జేద్దామని కష్టపడి ఎన్నికల్లో గెల్చినోళ్లను, పంచాయితీల అభివృద్ధికి నామమాత్రంగా నిధులిస్తున్నారు. ఊర్లో పారిశుధ్యం, వీధిదీపాలు, మురికి కాల్వల నిర్మాణం, తాగునీరు వంటి వాటికే నిధులు సరిపోవడం లేదు. విద్యుత్​ బిల్లులకు రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని ప్రాధేయపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు నిధులిస్తే కరెంట్‌‌ బిల్లులు కట్టడం సర్పంచ్‌‌లకు ఇబ్బందేమీ కాదని, ఇప్పటికీ జీపీలకు వస్తున్న బిల్లులు కరెంట్ బిల్ కట్ చేశేస్తున్నారని లబోదిబో మంటున్నారు. పంచాయతీలకు పట్టణాల్లా ఆర్థిక వనరుల్లేవని, చిన్న పంచాయతీల ఆదాయం ఐదారువేలకు మించే పరిస్థితి లేదని అంటున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయాలని లేదంటే వచ్చే ఎన్నికల్లో సొంత పార్టీకే కష్టమవుతుందని పరోక్షంగా హెచ్చరిస్తున్నారు.