హుజూర్ నగర్ జూన్ 6 (జనంసాక్షి): సాగర్ ఎడమ కాలవ ఆయకట్టు పరిధిలోని ఎన్ఎస్పి కాలువ మరమ్మత్తు పనులు వేగంగా నాణ్యతతో చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. మంగళవారం హుజూర్ నగర్ లో సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ హుజూర్ నగర్ ఏరియా ఎక్కువ శాతం ఆయకట్టు సాగర్ నీళ్లపైనే ఆధారపడి ఉందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందస్తు వరి నాట్లు వేయాలని సూచనలు చేయడంతో ఆయకట్టు పరిధిలో కాలవ మరమ్మత్తులు నాణ్యతతో వేగంగా పూర్తిచేయాలని ఆయన అన్నారు. దిగువన రైతాంగానికి సాగర్ నీటి సరఫరా అందించాలన్నారు. మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ప్రభుత్వ భూములను సేకరించి ఇళ్ల స్థలం లేని వారికి ఇళ్ల స్థలం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగరపు పాండు, మండల కార్యదర్శి పోసనబోయిన హుస్సేన్, మండల కమిటీ సభ్యులు తంగెళ్ల వెంకట చంద్ర, షేక్.డ. ఖాసిం, వెల్లంశెట్టి వీరస్వామి, చింతకుంట్ల వీరయ్య, చందాల భిక్షం, పిన్నపు రెడ్డి వెంకటరెడ్డి, మాటూరి నరసింహ చారి తదితరులు పాల్గొన్నారు.
ఎన్ఎస్పి కాలువ మరమ్మత్తు పనులు నాణ్యతతో చేపట్టాలి – సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి




