ఇటిక్యాల (జనంసాక్షి) జూన్ 6 : పత్తి పంటలను సాగుచేసే రైతులు పంటలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని గ్రామ వ్యవసాయ అధికారి భరతసింహా అన్నారు. మంగళవారం మండల పరిధిలోని చాగాపురం, బుడ్డారెడ్డిపల్లి గ్రామాలలో పత్తి పంటలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా పంటల భాస్వరం లోపం వలన కాండము మరియు ఆకులు ఎరుపు రంగులో మారిపోతున్నాయన్నారు. ఎకర పత్తి పంటకు 75 కేజీల డిఏపి లేదా సింగిల్ సూపర్ ఫాస్పేట్ 3 బస్తాలు వేసుకోవాలని సూచించారు. ఈ ఎరువులు వాడకం వలన పై సమస్యలు తొలగిపోతాయని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు రైతులుపాల్గొన్నారు.
పత్తి పంటలపై రైతులు అవగాహన కలిగి ఉండాలి




