Wednesday, 4 November 2026

ప్రగాఢ సానుభూతి తెలిపిన అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం, వడ్డేపల్లి జడ్పిటిసి రాజు

గద్వాల నడిగడ్డ, జూన్ 6 (జనం సాక్షి);జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం జక్కిరెడ్డిపల్లి గ్రామ బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రవి రెడ్డీ చిన్నాన్న గారి కుమారుడు అయిన శ్రీనివాస్ రెడ్డీ అనారోగ్యంతో బాధపడుతు మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం, వడ్డేపల్లి జెడ్పిటిసి కాశ పోగు రాజు వారి ఇంటికి వెళ్లి వారి భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఎమ్మెల్యే వెంట ప్రజా ప్రతినిధులు, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.