కుప్పం (జనంసాక్షి) : కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబు ద్రవిడ వర్శిటీలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం కుప్పంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. నైపుణ్యాభివృద్ధితోనే యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. ఈ ఏడాది వర్షపాతం చాలా తక్కువగా ఉంది. ఎంత ఖర్చైనా ఈ ఎడాది చివర్లోగా నీటిని అందిస్తామని, చిత్తూరు జిల్లాలో నీటి కరువును తరిమేందుకు ప్రణాళికలు రూపొందించామని ఆయన అన్నారు. ఈ సభలో స్కార్ట్ కుప్పం పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.




