Tuesday, 3 November 2026

ఎన్నికలంటే రియాల్టీ షో అనుకున్నావా..?

slider87రిపబ్లికన్ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష రేసులో దూసుకుపోతున్న డొనాల్డ్ ట్రంప్ పై మరోసారి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా విమర్శలు గుప్పించారు. వైట్ హౌజ్‌లో అడుగుపెట్టటమంటే.. రియాల్టీ షో అనుకుంటున్నావా అని ట్రంప్‌ ను ప్రశ్నించారు. ఉన్నత పదవిని స్వీకరించే వ్యక్తి హుందాగా ఉండాలని సూచించారు. అలాగే రిపబ్లికన్‌ పార్టీ నేతలు తమ ప్రతినిధిగా ఎవరిని ఎంచుకోవాలన్నది ఇప్పటికైనా తెలుసుకోవాలని కోరారు. అధ్యక్ష పదవిని జోక్‌ గా తీసుకుంటున్న ట్రంప్‌ ను ఓడించాలని పిలుపునిచ్చారు. వివాదస్పద వ్యాఖ్యలు, విదేశాంగ విధానంపై స్పష్టత లేని వారు అధ్యక్షులు కావటం సరికాదని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *