హైదరాబాద్ : తెలంగాణ మంత్రులకు ఇప్పటికైనా జ్ఞానోదయం కలిగి ప్రజలకు నమ్మకం కలిగేలా నిర్ణయం తీసుకుంటే మంచిదని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. తనతో పాటు మంత్రులంతా రాజీనామాలు చేసివుంటే…. తెలంగాణ ఎప్పుడో వచ్చేదని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రి పదవి వదులుకొని కేసీఆర్ కన్నా తానే పెద్ద త్యాగం చేశానని ఆయన చెప్పుకొచ్చారు. తాజా పరిణామాలు చూస్తే స్థానిక సంస్థలు, సాధారణ ఎన్నికల కోసమే అన్న అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఇప్పటికైనా ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంటేనే మంచిదని కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు.




